స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వచ్చినట్టేనా?

by correspondent
Published: Last Updated on 111 views

హైదరాబాద్ లో చాలా మంది ఇంగ్లీష్ నేర్చుకోవటానికి స్పోకెన్ ఇంగ్లీష్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. వీరు ఇంగ్లీష్ మాట్లాడటం వస్తే చాలు ఇంగ్లీష్ వచ్చినట్టే అనుకుంటున్నారు. అయితే స్పోకెన్ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ మాట్లాడటం) వస్తే ఇంగ్లీష్ వచ్చినట్టేనా? మన హైదరాబాద్ వాసులు స్పోకెన్ ఇంగ్లీష్ ఫై ఎందుకు మక్కువ చూపిస్తున్నారు?

భారతీయులు, ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రజలు, సినిమా స్టార్లను అధికంగా అభిమానిస్తారు (వారు ఎలా మాట్లాడితే అలా మాట్లాడాలనుకుంటారు లేదా వారు ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తించాలనుకుంటారు). సాధారణంగా సినిమా స్టార్లు ఇంగ్లీష్ భాషను ఒక సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. వీరు ప్రజలను ఆకర్షించటానికి పరదేశ ఉచ్చారణ లేదా యాసను ఉపయోగిస్తారు. ప్రజలు వారిలాగే మాట్లాడాలని లేదా సంభోదించాలని వారిని అనుసరిస్తారు. అందుకే స్పోకెన్ ఇంగ్లీష్ ఫై దృష్టి పెడతారు.

స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాచుర్యం పెరగటానికి మరొక కారణం నగరంలో పుట్టుకొచ్చిన అనేక స్పోకెన్ ఇంగ్లీష్ సంస్థలు. ఈ సంస్థలు అతి తక్కువ సమయంలో 100% ఇంగ్లీష్ నేర్పిస్తామని తప్పుడు హామీ ఇచ్చి ప్రజలను ఆకర్షిస్తున్నాయి. చాలా మంది సరైన పద్ధతిలో ఇంగ్లీష్ నేర్చుకునే విధానాన్ని గురించి పట్టించుకోవటం లేదు. వీరికి కావలసింది ఇంగ్లీష్ నేర్చుకోవడం, అదికూడా తక్కువ సమయంలో. వీరిలో ఎక్కువ మందికి ఇంగ్లీష్ నేర్చుకునే విషయములో సరైన అవగాహన, పట్టుదల లేనందున వారు ఆలోచన లేకుండా ఈ ఇంగ్లీష్ శిక్షణా సంస్థలలో చేరుతున్నారు.

ఇంగ్లీష్ నేర్చుకునే ప్రక్రియలో ఏమి వుంటుంది?
ఇంగ్లీష్ నేర్చుకోవటానికి ఒక ప్రామాణిక విధానం ఉంటుంది. ఇందులో చదవడం, అర్ధం చేసుకోవటం, వ్రాయడం, వినడం, మరియు మాట్లాడటం వంటి విషయాలు ఉంటాయి. కేవలం మాట్లాడటం ఫై దృష్టి పెడితే ఇంగ్లీష్ నేర్చుకోలేరు. ఈ విధంగా ఇంగ్లీష్ నేర్చుకోవటం ఎలా ఉంటుందంటే రహదారిలో వేగంగా ప్రయాణిస్తున్న వందల లారీల మధ్య మీరు నేరుగా బండిని నేర్చుకోవటం లాగా ఉంటుంది.

మీకు ఒక విషయం తెలుసా? మంచి పాఠశాలలు కొన్ని సంవత్సరాల వరకూ స్పోకెన్ ఇంగ్లీష్ ఫై దృష్టి పెట్టవు. ఎందుకంటే మాట్లాడటం అనేది ఆకస్మికంగా రావాలే కాని బలవంతంగా మాట్లాడితే వచ్చేది కాదు. భాష ఫై పట్టు వుంటేనే మాట్లాడటం వస్తుంది. భాష ఫై పట్టు రావాలంటే ఆ భాష ప్రక్రియని మెల్లిమెల్లిగా అనుసరించాలి. ఇది ఒక మోటార్ సైకిల్ నేర్చుకోవడం లాంటిది – మొదట బైక్ ని సంతులనం చేయాలి, తరువాత క్లచ్, గేర్, యాక్సిలిరేటర్, మరియు బ్రేక్ మొదలయిన వాటన్నిటిని సరిగ్గా ఉపయోగించి బండిని సరిగ్గా నడపటం లాంటిది.

నేరుగా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు తీసుకోవడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. సాధారణంగా ఉపయోగించే కొన్నిసంభాషణా పదాలను మాత్రమే మీరు తెలుసుకోగలరు. అంతకన్నా ఎక్కువ నేర్చుకోలేరు. ఈ విధంగా మీరు ఇంగ్లీష్ పూర్తిగా నేర్చుకోలేరు.

స్పోకెన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకునే ప్రక్రియలో మొదటి మెట్టు కాదు. ఈ విధంగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ప్రయత్నిస్తే, ఇంగ్లీష్ నైపుణ్యాల ఫై మీకు ఫై ఫై అవగాహనా మాత్రమే వస్తుంది. అసలు ఇంగ్లీష్ అంటే ఏంటి అని మీకు పూర్తిగా అర్ధం తెలియాలంటే వ్రాసిన విషయంలో ఏమి చెబుతున్నారని తెలుసుకోడానికి, చదవడం మరియు అర్ధాలను తెలుసుకోవడం అవసరం. దీనికి నిరంతర సాధన చేయాలి.

ఇంగ్లీష్ శిక్షణ పొందటానికి 80% చదవడం మరియు అర్ధాలను తెలుసుకోవడం గురించి ఉంటుంది. 20% మాత్రమే స్పోకెన్ ఇంగ్లీష్ ఉంటుంది. మీరు 20% కన్నా ఎక్కువ స్పోకెన్ ఇంగ్లీష్ ఫై దృష్టి పెడితే ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టమనిపిస్తుంది. స్పోకెన్ ఇంగ్లీష్ ఒక కూర లాంటిది. ఇది భోజనంలో ఒక భాగం లాంటిదే కానీ భోజనంకోసం పూర్తిగా కూరను మాత్రమే తినలేం కదా!. అలాగే ఇంగ్లీష్ నేర్చుకోవటంలో స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఒక భాగం మాత్రమే.

చదవడం మరియు వినడం ఫై దృష్టి సారించండి
ఇంగ్లీష్ నేర్చుకొనుటకు, చదివే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకోవడమే పరిపూర్ణమైన మార్గం. ఎందుకంటే చదవటం అనేది అభ్యాసకుడికి భాషను అర్ధం చేసుకోటానికి కొంత సమయాన్ని ఇస్తుంది. ఈ విధంగా, మొదట చదివే నైపుణ్యాల మీద నిలకడగా దృష్టి కేంద్రీకరిస్తే మెల్లిగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు.

USA మరియు UK దేశాలలోని చిన్న పిల్లలు భాషను నేర్చుకుంటున్నప్పుడు వారి తల్లిదండ్రులు ఆసక్తికరమైన చిన్న చిన్న కథలను చదివి వినిపిస్తారు మరియు సరదాగా వుండే పద్యాలను నేర్పిస్తారు. తరువాత వారు బొమ్మల పుస్తకాల ద్వారా పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించడానికి ప్రయత్నిస్తారు. ఇలా చదవడం ద్వారా పిల్లలకు భాష ఫై నిదానంగా పట్టు వస్తుంది మరియు వారు సొంతంగా పుస్తకాలను చదువుతారు.

వినడం అనేది భాష నేర్చుకునే ప్రక్రియలో ఒక భాగంలాంటిది. కానీ ఈ విధంగా భాషను నేర్చుకోడానికి మొదట్లో కొంత ఇబ్భందిగా అనిపిస్తుంది. అందుకే అభ్యాసన ప్రక్రియ యొక్క తరువాత దశలలో ఇది వస్తుంది. ఈ విధానాన్ని అనుసరించడం కొద్దిగా కష్టంగా అనిపించవచ్చు ఎందుకంటే మీరు నెమ్మదిగా చదువుకోవచ్చు కానీ మీరు ఇతర వ్యక్తులను నెమ్మదిగా మాట్లాడమని లేదా మళ్లీ చెప్పమని బలవంతపెట్టలేరు.

ఇంగ్లీష్ నేర్చుకునే ప్రక్రియలో చివరి భాగమే స్పోకెన్ ఇంగ్లీష్. చదవడం, వ్రాయడం, మరియు అర్ధాలను తెలుసుకోవడం వంటి విషయాలలో మీకు సంపూర్ణ నైపుణ్యం రానంతవరకూ, మీరు స్పోకెన్ ఇంగ్లీష్ ముందుకు వెళ్ళలేరు. ఈ అన్ని విషయాలలో మీరు నైపుణ్యవంతులైతే మీరంతట మీరే స్వయంగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. గుర్తుంచుకోండి ఇంగ్లీష్ నేర్చుకునే ప్రక్రియలో స్పోకెన్ ఇంగ్లీష్ చివరి భాగం.

Related Articles

Adblock Detected

Please support us by disabling your Adblocker extension from your browsers for our website.