ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? యాస ఫై దృష్టి పెట్టకండి!

నగరంలోని చాలా మంది విద్యార్ధులు ఇంగ్లీష్ నేర్చుకొనే ప్రయత్నంలో దాని యాస ఫై దృష్టి పెడుతున్నారు. దీనివలన వారు ఇంగ్లీష్ సరిగ్గా నేర్చుకోలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం, నగరంలోని ఇంగ్లీష్ శిక్షణ సంస్థలు. ఈ శిక్షణా సంస్థలు విద్యార్ధులు మాట్లాడే నైపుణ్యాలను అభివృద్ధి చేస్తాయే గాని ఇంగ్లీష్ భాషను పూర్తిగా నేర్పించవు. యాస ఫై ఎక్కువ ప్రాధాన్యత చూపడం వలన ఈ సంస్థలలో ఇంగ్లీష్ నేర్చుకునే విధానం పక్కదారి పడుతుంది.

సరైన యాసలో మాట్లాడగలిగితే ఇంగ్లీష్ వస్తుందని భావిస్తున్నారు
విద్యార్ధులు సరైన యాసలో మాట్లాడగలిగితే ఇంగ్లీష్ వచ్చేస్తుందని అనుకుంటున్నారు. కానీ ఇది పొరపాటు. ఇంగ్లీష్ మాట్లాడే దేశాలలో బిచ్చగాళ్ళు కూడా ఇంగ్లీష్ లో నైపుణ్యం లేకున్నా వారి స్థానిక యాసలో ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. అదే తెలివైన మరియు విద్యావంతులు, స్థానిక యాసలో మాట్లాడే నైపుణ్యం కన్నా కూడా ఇంగ్లీష్ భాషలోని వ్యాకరణాలను, కూర్పులను, భావనలను, మొదలైన ముఖ్యమైన వాటి ఫై దృష్టి పెడతారు.

అయితే, వేరే ఇంగ్లీష్ మాట్లాడే దేశాలలో వివిధ స్వరాలు కలిగి వుండటం వాస్తవమే. ప్రతి ప్రాంతానికి తన జనన ప్రభావం వలన తనదయిన ఇంగ్లీష్ ఉచ్ఛారణ శైలి వుంటుంది. ఈ ఉచ్ఛారణలు ప్రపంచ వ్యాప్తంగా అనుమతించబడతాయి. నిజమైన భాషను నేర్చుకోవాలనుకున్నప్పుడు యాసకు ప్రాముఖ్యత ఇవ్వనవసరంలేదు.

మీ జ్ఞానాన్ని తెలియజేయటానికి భాష తెలుసుకోండి
ఉదాహరణకు డా.అబ్దుల్ కలాం ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా తమిళం కలిసినట్టుగా అనిపిస్తుంది కానీ తన సందేశాన్ని మరియు తనకు కలిగివున్న జ్ఞానాన్ని ప్రసంగాల్ల ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. వారి ప్రసాంగాల్లు దేశంలోని అనేకమందికి ప్రేరణగా అనిపిస్తాయి. ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణ మూర్తిగారికి కూడా స్టైలిష్ ఉచ్ఛారణ లేనప్పటికీ వారు తన పరిశ్రమలో అత్యంత పరిజ్ఞానవంతులు మరియు గౌరవనీయమైన వ్యక్తి. ఇటువంటి గొప్ప వ్యక్తులు వారి ఆలోచనలను, అభిప్రాయాలను, మరియు ఇతర పరిశ్రమ విషయాలను తెలియచేయటానికి భాషను ఒక మాధ్యమంగా మాత్రమే వాడతారు.

ఒక వ్యక్తి ఎపుడైతే పరిజ్ఞాణంతో మాట్లాడతాడో, అతన్ని ప్రపంచమంతటా మెచ్చుకుంటారు.

యాస అనేది కేవలం సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు కొందరు. ఇటువంటివారిని మన భారతదేశంలో చాలా చూడవచ్చు. ఉదాహరణకు మన సామజిక వర్గ ప్రజలు (సినీ తారలు, అసమర్ధ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మొదలైనవారు). వీరి దగ్గర వ్యక్తీకరించడానికి సరైన అంశాలు లేనప్పుడు, తమవైపు ఆకర్షించుకోడానికి యాసను ఒక సాధనంగా ఉపయోగిస్తారు. కొందరు తెలివిలేని విద్యార్ధులు ఇంగ్లీష్ నేర్చుకోడానికి, ఇటువంటి భాషను ప్రదర్శనగా ఉపయోగించే వ్యక్తులను ప్రేరణగా తీసుకుంటున్నారు.

ఇంగ్లీష్ మీద పట్టు తెచ్చుకోడానికి భాషలోని నైపుణ్యాలమీద దృష్టి పెడితే సరిపోతుంది. ఒక వ్యక్తికి తన వృత్తికి సరిపోయే పరిజ్ఞానం మరియు ఇంగ్లీష్ నైపుణ్యాలు కలిగి ఉంటే చాలు. ఒక వ్యక్తి ఎపుడైతే తన వృత్తి విషయాలలో నైపుణ్యం ఉండి, సాధారణ ఇంగ్లీష్ భాషలో మాట్లాడగలిగితే తప్పకుండా గౌరవాన్ని పొందుతాడు.

VN:F [1.9.17_1161]
Rating: 5.0/5 (2 votes cast)
ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? యాస ఫై దృష్టి పెట్టకండి!, 5.0 out of 5 based on 2 ratings
What do you think of this post?
  • Insightful (0)
  • Informative (0)
  • Helpful (0)
  • Can-be-Improved (1)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*