స్పోకెన్ ఇంగ్లీష్ కన్నా వ్రాత నైపుణ్యాలఫై ఎందుకు దృష్టి పెట్టాలి?

by correspondent
Published: Updated: 155 views

నగర విద్యార్ధులకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనే వ్యామోహాన్ని చూస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వీరి ఆసక్తి కారణంగా నగరంలో అనేకమైన స్పోకెన్ ఇంగ్లీష్ భోధనా సంస్థలు పుట్టుకొచ్చాయి. ఈ వాణిజ్య సంస్థలు, కొద్ది రోజుల్లోనే ఇంగ్లీష్ లో సరళంగా మాట్లాడేలా చేస్తామని హామీ చేస్తాయి – ఇదే వీరి ముఖ్యమైన వ్యాపార మంత్రం. ఇటువంటి సంస్థలను, హైదరాబాద్ లో మీరు శివార్లలో ఎన్నో చూడవచ్చు. ఈ సంస్థల యొక్క బిల్లు బోర్డులను, కర పత్రాలను, ప్రకటనలను సందడిగా వున్న నగర వీధుల్లో మీరు చూడవచ్చు. వీటిని చూసిన చాలా మంది విద్యార్ధులు గుడ్డిగా ఈ సంస్థలలో చేరుతున్నారు.

ప్రజలు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోడానికి డబ్బును ఖర్చుచేస్తారు కానీ కెరీర్ పెరుగుదలలో వ్రాతపూర్వక ఇంగ్లీష్ కు కూడా ప్రాముఖ్యత ఉన్నదన్న విషయం తెలుసుకోవటంలో విఫలం అవుతున్నారు. కాబట్టి ఈ సంస్థలు అందించే స్పోకెన్ ఇంగ్లీష్, కెరీర్ అభివృద్ధిలో కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుందని గ్రహించండి.

US మరియు ఇంగ్లాండ్ వంటి దేశాలలోని అత్యంత నిరక్షరాస్య వ్యక్తి/ వ్యక్తులు కూడా ఇంగ్లీష్ లో బాగానే మాట్లాడగలరు. కాని అత్యధిక స్థాయిలో వీరు కాల్ సెంటర్ అసోసియేట్ లేదా రిటైల్ కౌంటర్ క్లర్క్ ఉద్యోగాలను మాత్రమే పొందగలరు. కాల్ సెంటర్ ఉద్యోగాలలో పనిచేసే వ్యక్తికి లేదా వ్యక్తులకు తప్పనిసరిగా ఇంగ్లీష్ లో వ్రాయడం వచ్చివుండాలి కంప్యూటర్ లో నమోదుచేయటానికి. కార్పొరేట్ సంస్థలలోని ఉన్నత స్థాయిలను మీరు అధిరోహించిన అధిరోహించినకొద్దీ మీ యొక్క ఇంగ్లీష్ వ్రాత నైపుణ్యాలకు ప్రాముఖ్యతను పొందుతారు.

వ్రాత నైపుణ్యం వృత్తి ఎదుగుదలను నిశ్చయిస్తుంది
మంచి వ్రాత నైపుణ్యాలు కెరీర్ అభివృద్ధికి అవసరం. ఉద్యోగ సంక్షేపములు రాసేటప్పుడు, ఖాతాదారులతో ఉత్పత్తుల గురించి సంభాషించేటప్పుడు, మరియు వినియోగదారులతో సంభంధాలను ఏర్పరుచుకోవడం వంటి విషయాలలో వ్రాత నైపుణ్యాలు కీలకపాత్ర పోషిస్తాయి. వ్రాత నైపుణ్యాలు అమ్మకాలను జరుపటానికి అవసరం ఎందుకంటే ఖాతాదారులు లేదా వ్యాపారవేత్తలు చాలావరకు వ్రాసిన ప్రతిపాదనలను మాత్రమే ఇష్టపడతారు. ఉద్యోగ సంక్షేపములో మీ యొక్క అనుభవాన్ని, లక్షణాలను, మరియు స్వభావాన్ని స్పష్టమైన వాక్యాలలో పొందుపరిస్తే, మీరు తప్పకుండా నియామకుడి విశ్వాసాన్ని పొందగలరు. కానీ ఈ సంస్థలు స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రమే బోధిస్తున్నాయి కానీ వ్యక్తిగతంగా అవసరమయ్యే వ్రాత నైపుణ్యాలను అబివృద్ధి చేయటంలో ఎంతమాత్రమూ ద్రుష్టిపెట్టుట లేవు. ఇంగ్లీష్ లో సరళంగా మాట్లాడాలనుకునే వారు మొదట వ్రాతపూర్వక ఇంగ్లీష్ పైన మంచి పట్టును సాధించుకోవాలి. మీ వ్రాత నైపుణ్యాలు ఎపుడైతే బాగుంటాయో, అపుడే మీ యొక్క శబ్ష నైపుణ్యాలు బాగుంటాయి.

స్పష్టమైన వ్రాత, మీ యొక్క సామర్ధ్యాలను తెలుపుతుంది
ఇంగ్లీష్ లో వ్రాయడానికి, వ్యాకరణం, పదజాలం, మరియు పద నిర్మాణం వంటి అంశాల గురించి పరిజ్ఞానం వుండాలి. స్పష్టమైన, నిర్మాణాత్మక, మరియు సరైన లిఖిత పూర్వక వాక్యాలు మరొకరి ఆలోచనలను చదువరలుకు తెలుపటంలో ఎంతో తోడ్పడుతాయి. ప్రభావాత్మక వ్రాతపూర్వక ఇంగ్లీష్, ఆలోచనలను, భావాలను, మరియు అభిప్రాయాలను కలవరపెట్టవు. మంచి రచన సానుకూల లక్షణాలు వంటి స్వీయ విశ్వాసం, స్పష్టమైన ఆలోచన, విశ్లేషణాత్మక మనస్సును ప్రతిబింబిస్తాయి. సరిగ్గా వ్రాయడం గనుక మీరు చేస్తే మిమ్మల్ని ఇది తెలివివంతులుగా చూపిస్తుంది. వ్రాత నైపుణ్యం కూడా ఒక వ్యక్తికి కలిగివున్న సంస్థాపరమైన నైపుణ్యాలకు సంభందించినది. ఒక వ్యక్తి దేనిగురించయిన సమర్ధవంతంగా వ్రాస్తే అతనికి దాని గురించి మానసిక స్పష్టత కలిగి ఉన్నదని అర్ధంచేసుకోవచ్చు.

ప్రభావాత్మక వ్రాతపూర్వక ఇంగ్లీష్ మీ యొక్క ఆలోచన ప్రక్రియను మెరుగుపరుస్తుంది మరియు మంచి పద్ధతిలో మాట్లాడటానికి తోడ్పడుతుంది. ఒక వ్యక్తి ఏదైతే మాట్లాడతాడో అది అతనియోక్క ఆలోచన ప్రక్రియ నుండి వెలువడినది.

వ్రాతపూర్వక ఇంగ్లీష్, ప్రదర్శనలు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. కానీ ఇది ఇతరులకు అర్ధమయ్యే విధంగా ఉండాలి. ఊహించుకోండి, మీరు ఒక జట్టు నాయకుడు. మిమ్మల్ని ఒక ప్రాజెక్ట్ గురించి కార్యాచరణ ప్రణాళికను లేదా దాన్ని చేరుకోవటం ఎలా అన్న అంశం పైన నివేదికను సమర్పించమన్నప్పుడు, మీ వ్రాత నైపుణ్యాలు సహాయపడుతాయి (నివేదికను తయారు చేయటానికి మరియు ఆత్మ విశ్వాసాన్ని పొందటానికి).

ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు, మాట్లాడే వేగం ముఖ్యమైనది, అయితే ఆలోచన యొక్క ఖచ్చితత్వం మరియు స్పష్టత వ్రాయడం లో ముఖ్యమైనది.

Related Articles