మీ ఇంగ్లీష్ వ్రాత నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలనుకుంటున్నారా ? అయితే బెంజమిన్ ఫ్రాంక్లిన్ సూత్రాలను పాటించండి!

by correspondent
Published: Updated: 227 views

వ్రాయడం అనేది పుట్టుకతో వచ్చిన నైపుణ్యం కాదు, నేర్చుకుంటే వచ్చేది. అయితే ప్రముఖ రచయిత బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారికి మొదట వ్రాతలో నైపుణ్యం లేకున్నా కూడా అతను ఇంగ్లీష్ వ్రాత నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు మరియు విమర్శకుల నుండి ప్రశంసలు పొందారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ని ‘అక్షరాలలో అమెరికా యొక్క మొదటి గొప్ప వ్యక్తి’ అని పిలుస్తారు మరియు వారు ఇంతటి స్థాయికి ఎలా వచ్చారో అని కూడా అందరూ ఆశ్చర్యపోతారు.

ఫ్రాంక్లిన్ జీవితచరిత్రని అందరూ పాఠశాలలో చదివేవుంటారు. వారు మంచి ప్రాముఖ్యత కలిగిన కథలను సృష్టిస్తారు మరియు వాటి యొక్క అనేక అంశాలను వివరణాత్మకంగా తెలియజేస్తారు.

ఫ్రాంక్లిన్ యువకుడిగా ఉన్నప్పుడు, అతను వ్రాసిన ప్రతియొక్క అంశం (ఉత్తరం మరియు పుస్తకాలలో వ్రాసిన అంశాలు) సరిగ్గా వున్నాయని భావిస్తుండేవాడు. కానీ, ఒక రోజు ఫ్రాంక్లిన్ తండ్రి తన కుమారుడు వ్రాసిన అక్షరాలలో కొన్ని తప్పులు ఉన్నట్లు గమనించాడు. వెంటనే అతని కుమారుడు వ్రాసిన తప్పులను చక్కగా చూపించారు మరియు స్పెల్లింగ్, విరామ చిహ్నాలు సరిగ్గానే ఉన్నాయి అని, కానీ భావ వ్యక్తీకరణ యొక్క పొందికలో మరియు పద్ధతి లో లోపం ఉందని తన కుమారుడికి ఉదాహరణలతో తెలియజేసాడు.

ఫ్రాంక్లిన్ తన తండ్రి యొక్క పరిశీలనలకు అనేక విధాలుగా స్పందించాడు. ప్రముఖ రచయితలు వ్రాసిన కొన్ని అంశాలను తీసుకుని, వాటికి సరిపోయిన అంశాలను పుస్తకాలలో ఉదాహరణలతో కనుక్కున్నాడు. ఈ ఉదాహరణల ద్వారా, ఆ అంశాలను తన స్వంత పదాలతో తిరిగి వ్రాశాడు, వాటి అర్ధం మార్చకుండా. ఇలాగే ఎన్నో రచయితల శీర్షికలను/వ్యాసాలను తన స్వంత పదాలతో తిరిగి రాశాడు. అంతా రాశాక తను వ్రాసిన శీర్షికని అసలు శీర్షికతో పోల్చాడు మరియు తను చేసిన తప్పులను తెలుసుకుని వాటిని సరిదిద్దుకున్నారు. ఇటువంటి విశేషమైన కార్యక్రమాన్ని ముందు ఎవరూ కూడా ఆలోచించలేదు కావచ్చు.

తను వ్రాసిన తప్పులలో పదజాలం సమస్య ఉందని తెలుసుకోగలిగారు. దాన్ని సరిదిద్దుకోవడం ఎలా అని ఆలోచించారు. తరువాత తను తెలుకున్నదేమిటంటే కవితలు వ్రాయడానికి కొన్ని పదాలు తెలుసుకోవాలనుకున్నారు. ఒకే పదాన్ని మరొక విధంగా కొన్ని సందర్భాలలో ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నారు. ఈ పదాలను తను వ్రాసిన వ్యాసాలలో ఉపయోగించి మరొకసారి అసలు వ్యాసాలతో పోల్చుకునేవారు. అందులో ఏవైనా తప్పులు వుంటే సరిచేసుకునేవారు.

మంచి వ్యాసానికి పొందికతో పాటు సరైన అంశాలు వుండటం ముఖ్యమని గుర్తించారు. అ పద్ధతిని ఎలా అబివృద్ధి చేసుకోవాలో కష్టపడి తెలుసుకున్నారు. అయితే ఒక వ్యాసాన్ని తీసుకుని దానిలోని ప్రతియొక్క వాక్యాన్ని తిరిగి రాసి చిన్న చిన్న కాగితాలలో పొందుపరచుకునేవారు. తరువాత వాటిని కలిపేసి భద్రంగా దాచుకునేవారు. ఆ వ్యాసాన్ని పూర్తిగా మరిచిపోయాక, కొద్ది రోజులకు ఆ కాగితాలను వెలికి తీసి సరైన క్రమ పద్ధతిలో పెట్టేవారు. అలా పేర్చిన కాగితాలను అసలైన వ్యాసంతో పోల్చేవారు. అపుడు కూడా తప్పులు వుంటే మరలా సరిదిద్దుకునేవారు.

అతనికి మార్గనిర్దేశం చేసేందుకు ఏ గురువు లేరు, కానీ తన తండ్రి అతను వ్రాసిన వ్యాసాలలో కొన్ని నిర్దిష్ట లోపాలను గుర్తించేవారు. ఇలా ఉదాహరణలను ఉపయోగించి, స్వంత సామర్ధ్యాలను కనిపెట్టగాలిగారు. ఆకర్షనీయమైన, సమయోచితమైన, సృజనాత్మకతమైన అంశాలతో కూడిన రచనలను ఉత్పత్తి చేయాలనుకున్నాడు ఫ్రాంక్లిన్.

వ్రాత నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలనుకునేవారు, ఫ్రాంక్లిన్ నేర్చుకున్న విధానాన్ని పాటించడమే ఉత్తమం.

Related Articles