హైదరాబాద్ లో ఉత్తమమైన ఇంగ్లీష్ శిక్షణా సంస్థలు

by correspondent
Published: Updated: 204 views

వృత్తిలో అభివృద్ధి చెందాలన్నామరియు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకోవాలనుకున్నా ఇంగ్లీష్ నైపుణ్యం తప్పనిసరి అని తెలుసుకున్న అనేకమంది ప్రజలు నేడు ఇంగ్లీష్ శిక్షణా సంస్థలలో చేరుతున్నారు. కానీ కొంతమంది సరైన ఇంగ్లీష్ సంస్థలను ఎంపిక చేసుకోలేకపోతున్నారు.

సంస్థను ఎంచుకోవడంలో అభ్యర్ధులు చేసే సాధారణ తప్పులు:

  • ఛాలా మంది గొప్పగా చెప్పుకునే సంస్థలను ఆశ్రయిస్తున్నారు (100% ఫలితాలు, ప్లేస్ మెంట్లు, మొదలైనవి)
  • సత్వర మార్గాలను ఉపయోగించి అతి తక్కువ సమయంలో ఇంగ్లీష్ కోర్సుని నేర్పిస్తామని వాగ్దానాలు చేసే సంస్థలకు ఆకర్షితులవుతున్నారు.

ఈ రోజులలో అనేకమైన ఇంగ్లీష్ శిక్షణా సంస్థలు వారి వ్యవస్థల గురించి మరియు విజయాల గురించి అవసరమైన దానికన్నా ఎక్కువ చెబుతున్నాయి (తప్పుడు సమాచారాలు చెప్పి విధ్యార్ధులను ఆకర్షిస్తున్నారు వ్యాపారం చేయడానికి). కాని ప్రతియోక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమనగా భాషలో ప్రావిణ్యం పొందటానికి సరైన కార్యాచరణ లక్షణాలు కలిగివున్న సంస్థను ఎంపికచేసుకోవాలి.

మంచి ఇన్స్టిట్యూట్ లక్షణాలు:

  • ఇంగ్లీష్ ను ఆసక్తిగా నేర్పించడానికి సరైన ఉపకరణాలు మరియు సాహిత్యాన్ని అందిస్తుంది
  • నెమ్మదిగా మరియు క్రమంగా నైపుణ్యాలను ప్రస్పుటిస్తుంది
  • ఇంగ్లీష్ యొక్క అన్ని అంశాలను తెలుపుతుంది – వినడం, మాట్లాడడం, చదవడం, మరియు వ్రాయడం
  • సంస్కృతి, సాహిత్యం, వివేకం, సమాచారం, ప్రజలు, మొదలైన వాటికి పరిచయం చేస్తుంది
  • శిక్షణ వాస్తవ ప్రపంచంలో ఉపయోగపడేలా ఇస్తుంది, కేవలం పరీక్షలకు లేదా ఇంటర్వ్యూలకు ఉపయోగపడేలా కాదు

హైదరాబాద్ నగరంలోని కొన్ని మంచి ఇంగ్లీష్ శిక్షణా సంస్థలు:
రామకృష్ణ మటం:
హైదరాబాద్ లోని కొన్ని ఉత్తమమైన ఇంగ్లీష్ శిక్షణా సంస్థలలో రామకృష్ణ మటం సంస్థ ఒకటిగా గుర్తించబడింది. ఈ సంస్థ అనుభవం మరియు ఉన్నత అర్హతలు కలిగి ఉన్న భోధనా సిబ్భందితో ఉత్తమమైన భోధన అందిస్తుంది.

విద్యా కోర్సులు మరియు వీటి కాలవ్యవధి వివరాలు: ఈ సంస్థ రెగ్యులర్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు (4 స్థాయిలలో – ప్రాథమిక, జూనియర్, సీనియర్, మరియు ఉన్నత స్థాయి) మరియు స్వల్పకాలిక ఇంటెన్సివ్ కోర్స్ (ICCE)ని అందిస్తుంది.

రెగ్యులర్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు ఒక సంవత్సర సమయంలో 3 సార్లు నిర్వహిస్తారు (జనవరి, జూన్, సెప్టెంబరు నెలల్లో వుంటుంది). ICCE కోర్సు ఏప్రిల్ నెలలో ప్రారంభిస్తారు మరియు ఈ కోర్సుని పూర్తిచేయడానికి ఒక నెల వ్యవధి సమయం తీసుకుంటారు. వివిధ కోర్సుల ప్రవేశ ప్రకటనలు మరియు ధరకాస్తుల వివరాలను వారి సంస్థ వెబ్ సైట్లో ప్రకటిస్తారు.

సంపర్క వివరాలు: రామకృష్ణ మటం, ఇందిరా పార్క్ ఎదురుగా, లోయర్ ట్యాంక్ బండ్, హైదరాబాద్.
ఫోన్ నెంబర్: 040 – 27635545; పని వేళలు: 8.00 AM to 11.30 AM – 4.00 PM to 6.30 PM ;
వెబ్ సైట్: rkmath.org

బ్రిటిష్ కౌన్సిల్ అఫ్ ఇండియా: ఇది UK ఆధారిత విద్యా సంస్థ.
విద్యా కోర్సులు మరియు వీటి కాలవ్యవధి వివరాలు: ఈ సంస్థ పెద్దలకు మరియు పిల్లలకు, ఇంగ్లీష్ లో వివిధ రకాల కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సుల పేర్లు – ఇంగ్లీష్ ఎవల్యూషన్ (English evolution), ఇంగ్లీష్ ఎగ్సికుటివ్ (English executive), మరియు ఇంగ్లీష్ ఇంపాక్ట్ (English Impact ).

పెద్దల కోర్సులు మరియు పిల్లల కోర్సులు పూర్తి చేయడానికి 7 వారాల సమయం తీసుకుంటారు.

సంపర్క వివరాలు: బ్రిటిష్ కౌన్సిల్ టీచింగ్ సెంటర్, st. ఫ్రాన్సిస్ కాలేజీ, బేగంపేట్, హైదరాబాద్.
ఫోన్ నెంబర్: 040 – 23483333;
వెబ్ సైట్: http://www.britishcouncil.org/india-common-hyderabad.htm

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU): ఈ విశ్వవిద్యాలయం యొక్క దూరవిద్యా కేంద్రం, ఇంగ్లీష్ లో ఎవరైతే నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలనుకుంటునారో, వారి కోసం ఇంగ్లీష్ కోర్సుని నిర్వహిస్తోంది. ఇందులోని భోధనా సిబ్భంది HCU మరియు EFLU వంటి విశ్వవిద్యాలయాలలోని అనుభవజ్ఞులైన ఇంగ్లీష్ శిక్షణా నిపుణులు.

విద్యా కోర్సులు మరియు వీటి కాలవ్యవధి వివరాలు: ఈ సంస్థ కమ్యునిక్యేటివ్ (communicative) ఇంగ్లీష్ లో పీజీ డిప్లొమా (PG Diploma) కోర్సుని దూరవిద్యా రీతిలో నిర్వహిస్తోంది. ఈ కోర్సు పూర్తిగా ప్రాథమికమయినది కాదు కానీ ఇంగ్లీష్ లో కనీస జ్ఞానం కలిగి వుండి మరియు ఇంగ్లీష్ లో నైపుణ్యాలను అబివృద్ధి చేసుకోవాలనుకుంటున్న అభ్యర్ధుల వారి కోసం అందిస్తున్నారు. ఈ కోర్సు కాలవ్యవధి ఒక సంవత్సరం, మరియు ప్రవేశ ప్రకటన నవంబర్ లో సంస్థ వెబ్ సైట్ లో ప్రకటిస్తారు.

సంపర్క వివరాలు: సెంటర్ ఫర్ డిసటెన్స ఎడ్యుకేషన్, UoH, గచ్చిబౌలి, హైదరాబాద్.
వెబ్ సైట్: http://www.uohyd.ernet.in/

ఇంగ్లీష్ యండ్ ఫారిన్ లాంగ్వేజేస్ యూనివర్సిటీ (EFLU): ఈ విశ్వవిద్యాలయం ఎవరైతే ఇంగ్లీష్ లో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నవారి కోసం మరియు ఇంగ్లీష్ భాషను వృత్తిగా ఆనుకుంటున్నవారికోసం ఇంగ్లీష్ భాషలో కోర్సులను అందిస్తుంది.

విద్యా కోర్సులు మరియు వీటి కాలవ్యవధి వివరాలు: ఈ విశ్వవిద్యాలయం ప్రాథమిక ఇంగ్లీష్ కోర్సు మరియు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులలో వివిధ స్వల్ప కాలిక కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సులు కేవలం ఇంగ్లీష్ లో కనీస జ్ఞానం ఉండి ఇందులో నైపుణ్యాలను మెరుగుపరచుకొవాలనుకుంటున్నవారి కోసమే. ప్రాథమిక ఇంగ్లీష్ కోర్సు 4 నెలల పాటు వుంటుంది (160 గంటలు) లేదా స్పోకెన్ ఇంగ్లీష్ 1 నెల ఉండవచ్చు. నవంబర్ లో ప్రవేశాలు ప్రారంబిస్తారు.

సంపర్క వివరాలు: EFLU , ఉస్మానియా యూనివర్సిటీ కాంపస్, హైదరాబాద్.
వెబ్ సైట్: http://www.efluniversity.ac.in/

సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (CELT), O.U: CELT వివిధ నేపధ్యాల నుండి వచ్చిన ప్రజలకు ఇంగ్లీష్ నేర్పించడానికి మరియు ఇంగ్లీష్ లో నైపుణ్యాలను అందించాలన్న ఉద్దేశంతో స్థాపించబడింది. ఇందులోని భోధనా సిబ్బంది OU ఇంగ్లీష్ విభాగం అధ్యాపకులు మరియు కార్పొరేట్ రంగంలోని ఇంగ్లీష్ శిక్షణా నిపుణులు.

విద్యా కోర్సులు మరియు వీటి కాలవ్యవధి వివరాలు: ఈ సంస్థ ఇంగ్లీష్ లోని పదజాలం, వ్యాకరణం వంటి వివిధ అంశాలఫై కోర్సులను అందిస్తుంది. ఈ కోర్సుల కాల పరిమితి 2 నెలలు వుంటుంది. ఈ అంశాలఫై వర్క్ షాప్ లు కూడా నిర్వహిస్తుంది.

ఈ సంస్థలోని కోర్సుల జాబితా:
ఇంగ్లీష్ వ్యాకరణం, పదజాలం, ఉచ్చారణ, మరియు యాస వంటి అంశాలఫై ఇంటరాక్టివ్ (interactive) కోర్సులు
ప్రత్యేకంగా గృహిణులకు ఇంగ్లీష్ కోర్సులు
కెరీర్ అవకాశాలను మెరుగుపరుచుకోడానికి ఇంగ్లీష్ కోర్సులు
సంపర్క వివరాలు: CELT, యూనివర్సిటీ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్, O.U కాంపస్, హైదరాబాద్.
వెబ్ సైట్: http://www.osmania.ac.in/celt/index.htm

వివేకానంద కేంద్ర , హైదరాబాద్: ఇదే సంస్థకు కన్యాకుమారిలో ఒక శాఖ వుంది మరియు హైదరాబాద్ లో అనేక కేంద్రాలు ఉన్నాయి. ఈ సంస్థ సరసమైన ధరలకు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులను విద్యార్ధులకు అందిస్తుంది.

విద్యా కోర్సులు మరియు వీటి కాలవ్యవధి వివరాలు:
ఈ సంస్థ ప్రాథమిక మరియు అధునాతన (advanced) స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులను అందిస్తుంది. ఈ కోర్సులు అన్ని శాఖలలో అందిస్తారు. ప్రాథమిక స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు సమయం 2 నెలలు మరియు అధునాతన స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సమయం 1 నెల. కోర్సుల ప్రవేశ ప్రకటనలు వీరి సంస్థ వెబ్ సైట్ లో ప్రతి నెల మొదటి వారంలో ప్రకటిస్తారు.

సంపర్క వివరాలు: వివేకానంద కేంద్ర, H.No: 8-3-319/1, యెల్లారెడ్డిగుడ, యూసుఫ్ గుడ మెయిన్ రోడ్, అమీర్పేట్, హైదరాబాద్ – 73.
ఫోన్ నెంబర్: 040-23743551;
వెబ్ సైట్: http://rvshyd.wordpress.com/

పైన పేర్కొన్న సంస్థలు నాణ్యమైన ఇంగ్లీష్ శిక్షణను అందిస్తునాయి.

Related Articles