హైదరాబాద్ లోని రామకృష్ణ మఠం విద్యార్ధులకు క్రమశిక్షణతో పాటు నాణ్యమైన చదువును అందించాలన్న ప్రధాన లక్ష్యంతో నడుస్తోంది. ఈ సంస్థలో అత్యంత ప్రతిభావంతులైన భోధనా సిబ్భంది వున్నారు. అందుకే నగరంలో ఈ సంస్థ ప్రసిద్ధి చెందింది.
రెగ్యులర్ మరియు తక్కువ కాలపరిమితి (షార్ట్ టర్మ్) స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులను అందిస్తుంది
హైదరాబాద్ లోని ఉత్తమమైన స్పోకెన్ ఇంగ్లీష్ సంస్థలలో రామకృష్ణ మఠం ఒకటి. వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ (VIOL) వివిధ భాషల కోర్సులపై నాణ్యమైన భోధనను అందిస్తుంది. వివిధ నేపధ్యాల నుంచి వచ్చిన విద్యార్ధుల కోసం స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులతో పాటు ఉద్యోగం పొందడంలో అవసరమయ్యే మాట్లాడే నైపుణ్యాలను కూడా అందిస్తుంది.
స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో చేరటానికి ప్రవేశ ప్రక్రియ:
స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు కోసం అభ్యర్ధులను ప్రవేశ పరీక్ష ద్వార ఎంపిక చేస్తారు. నగరంలోని ఇతర స్పోకెన్ ఇంగ్లీష్ సంస్థలలా కాకుండా, SSC లో తక్కువ మార్కులు తెచ్చుకున్న అభ్యర్ధులకు మాత్రమే కోర్సులో ప్రవేశం కల్పించటానికి అధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఇందులో రుసుము కూడా ఇతర సంస్తలకన్నా చాలా తక్కువ.
సంస్థలో పాటించాల్సిన నియమాలు:
- రామకృష్ణ మఠం ప్రాంగణంలో సందర్శకులు మరియు విద్యార్ధులు కొన్ని కఠినమైన నియమాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సంస్థ ఉన్నతమైన క్రమశిక్షణగల విద్యా సంస్థ కావున, కేవలం క్రమశిక్షణ తెలిసిన విద్యార్ధులకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అందువలన వారు క్రింద పేర్కొన్న నిభందనలకు విద్యార్ధులు అలవాటుపడాలని కోరుకుంటారు. ఈ నిభంధనలను ఎవరైతే విద్యార్ధులు పాటించరో, వారి ప్రవేశాన్ని రద్దు చేయడానికి సంస్థవారు ఏమాత్రం కూడా వెనుకాడదు.
- సంస్థలోని విద్యార్ధులు మరియు సందర్శకులు సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి. ఎవరైనా అసభ్యకరమైన దుస్తులు ధరించినట్టు కనబడితే వెంటనే వారిని కాంపస్ విడిచి వెళ్ళమని ఆదేశిస్తారు.
- తరగతి గదికి వెళ్ళటానికి, బాలికలకు మరియు బాలురకు ప్రత్యేక మెట్లను ఉపయోగించాలి, తరగతిలో విడి విడిగా కూర్చోవాలి. సంస్థ ప్రాంగణంలో మాట్లాడటం అనుమతించరు. అయితే తరగతిలో జరిగే సాముహిక చర్చల్లో సానుకూల స్ఫూర్తితో పాల్గొనటానికి విధ్యార్ధులను ప్రోత్సహిస్తా రు.
- సందర్శకులు లేదా విద్యార్ధులు వారి సెల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాలి. సంస్థవారు ల్యాప్టాప్ లను అనుమతించరు.
- సంస్థలో అనవసర విషయాలు అధ్యాపకులతో గానీ లేదా తోటి విధ్యార్ధులతో గానీ చర్చించరాదు. కేవలం కోర్సుకు సంభందించిన విషయాలను మాత్రమే తోటి విధ్యార్ధులతో లేదా అధ్యాపకులతో, తరగతిలో మాత్రమే చర్చించాలి.
- విద్యార్ధులు 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా సంస్థవారు వారిని తరగతులకు హాజరు కానివ్వరు. 10 నిమిషాల అదనపు సమయం మూడు సార్లు మాత్రమే ఇస్తారు. కోర్సు మొత్తంలో మూడు సార్లు మాత్రమే ఆలస్యంగా వస్తే ఒప్పుకుంటారు ఆ తరువాత విద్యార్ధి ప్రవేశాన్ని రద్దుచేస్తారు.
- ప్రతి సెషన్ ప్రారంభానికి 10 నిమిషాల ముందు, ప్రతి విద్యార్ధి ప్రార్ధనకు హాజరుకావాలి, లేకపోతె వారిని తరగతికి అనుమతించరు.
- ప్రవేశ సమయంలో విద్యార్ధులకు ఒక ప్రార్ధన పుస్తకం మరియు గుర్తింపు కార్డు ఇస్తారు. వీటిని తప్పకుండా విద్యార్ధులు తరగతులకు హాజరయ్యేముందు తీసుకురావాలి లేకపోతె వారిని అనుమతించరు. ఎవరైనా గుర్తింపు కార్డు కోల్పోతే సంస్థ ఎట్టి పరిస్థితుల్లో కొత్త కార్డు ఇవ్వదు.
- అభ్యర్ధులు తరగతి ప్రారంభం కాకముందే త్వరగా సంస్థకు వస్తే, వారు ఆడిటోరియంలో గానీ లేదా గుడిలో గానీ కూర్చోవాలి. క్యాంపస్ లో అటు ఇటు తిరగరాదు.
- సెషన్ లో, అభ్యర్ధులకు 4 తరగతుల కన్నా ఎక్కువ సెలవులు తీసుకోనివ్వరు. ప్రతియొక్క సెలవుకోసం విద్యార్ధులు సెలవు లేఖను అధికారులకు ఇవ్వవలసి ఉంటుంది లేనియెడల వారి ప్రవేశాన్ని రద్దు చేస్తారు.
- క్యాంపస్ లో లేదా తరగతి గదిలో, ఉన్నత అధికారులతో గానీ, అధ్యాపకులతో గానీ, తోటి విధ్యార్ధులతో గానీ ఎవరైనా దుశ్ప్రవర్తిస్తే సంస్థవారు వారిని సహించరు. మార్కుల చివరి మూల్యాంకనంలో 40% మార్కులు తరగతిలో విద్యార్ధి భాగస్వామ్యానికి గాను మరియు వారి ప్రవర్తనకు మార్కులు కేటాయిస్తారు. అందువలన తరగతిలో ఎవరైతే తప్పుగా ప్రవర్తిస్తారో వారికి మార్కులు తక్కువగా వేస్తారు.
రామకృష్ణ మఠం అభ్యర్ధులకు స్వేచ్చతో పాటు జ్ఞానాన్ని కూడా అందిస్తుంది. కానీ మౌలిక మానవ క్రమశిక్షణ విషయంలో ఎపుడూ కూడా రాజీపడదు.