మీ అవసరాలకు సరిపడే ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకోండి!

by correspondent
Published: Updated: 168 views

జీవితంలో విజయవంతం కావడానికి కావలసింది సంభాషణా నైపుణ్యం. వివిధ రంగాలలో పనిచేసేవారికి ఇంగ్లీష్ సంభాషణ చాలా అవసరం. వీరి ఇంగ్లీష్ అవసరాలు వేరు వేరుగా ఉంటాయి. బయట ప్రపంచంతో సంభాషించడానికి, మరియు మీ పని పూర్తి చేసుకోవడానికి సరిపడే ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలు.

ఈ విధంగా ఇంగ్లీష్ నేర్చుకోవటం పరిమితంగా అనిపించవచ్చు కానీ, ఇది మనము ప్రభావవంతంగా సంభాషించటానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఒక ఆటో బండి నడిపేవాడికి పెద్దగా ఇంగ్లీష్ అవసరం లేదు. కానీ తన వృత్తికి సరిపోయే అంత ఇంగ్లీష్ వస్తే చాలు. మామూలు మాటలు ‘సర్, మేడం, ఎక్కడికి వెళ్ళాలి’ అనే మాటలను ఇంగ్లీష్ లో చెప్పగలిగితే చాలు. ఇలాంటి మాటలు వారికి ప్రయాణికులతో మాట్లాడటానికి సహాయపడతాయి.

వివిధ వృత్తులలో ఉన్నవారు ఇంగ్లీష్ నేర్చుకోవడం వలన వారి వృత్తిలో ఎదగడానికి తోడ్పడుతుంది.

గృహిణులు
వీరు ఇంగ్లీష్ తప్పనిసరిగా నేర్చుకోవాలి ఎందుకంటే వీరి పిల్లలకు చదువు చెప్పడానికి, విందులలో మాట్లాడానికి, బిల్లులు కట్టడానికి, ప్రయాణంలో సురక్షితంగా ఉండటానికి, బ్యాంకు లావాదేవీలను చేయడానికి ఇంగ్లీష్ అవసరం. ఈ పనులకు సరిపడే ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలు.

అధ్యాపకులు /పాఠశాల ఉపాధ్యాయులు
అధ్యాపకులు వారు చెప్పే పాఠాలు పిల్లలకు అర్ధం అయ్యే విధంగా చెబితే చాలు. దానికి అవసరమైన ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలు.

పరిశోధకులు
పరిశోధకులు తమ సిద్ధాంతాలను తెలియజేయటానికి మరియు బహిరంగ ప్రదర్శనలు ఇచ్చేటపుడు ఇంగ్లీష్ ను మాత్రమే ఉపయోగిస్తారు. పరిశోధనకు సంభందించిన పరిభాషలను (టెర్మినాలజీలను) ఇంగ్లీష్ లో ప్రచురించటానికి వారికి ఇంగ్లీష్ లో అవగాహన వుండాలి.

సాఫ్ట్వేర్ నిపుణులు
సాఫ్ట్వేర్ నిపుణులు తప్పనిసరిగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అప్పుడే వారు వ్యాపార విషయాలను మరియు లావా దెవీలను సరిగ్గా అర్ధం చేసుకోగలరు. ఖాతాదారులతో మరియు ఫై అధికారులతో వ్యాపార విషయాలను చర్చించుటకు ఇంగ్లీష్ అవసరం. వ్యాపారానికి సంభందించిన నిర్దిష్ట పరిభాషలను – అవుట్సోర్సింగ్, లేడ్జేర్ మొదలైన పదములఫై అవగాహన వుండాలి.

ప్రభుత్వ అధికారులు
ప్రభుత్వ మేమోలు వ్రాయటానికి, ప్రభుత్వ ఉత్తర్వులు మరియు ప్రణాలికలు తెలియచేయటానికి, సీనియర్ అధికారుల అభిప్రాయాలు జారి చేయడానికి, ఏదయినా శీర్షిక ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు, మరియు మొదలగు పనులకోసం ఇంగ్లీష్ అవగాహన తప్పనిసరిగా అవసరం ప్రభుత్వ అధికారులకు.

టేలీకాలర్స్
తమ సంస్థ ఉత్పత్తులు / సేవలు అమ్మేటప్పుడు లేదా వాటిపై వినియోగదారులకు సలహా ఇచ్చేటప్పుడు ఇంగ్లీష్ లో స్పష్టతగా వుండాలి.

పై అవసరాలు కాకుండా సాధారణ వ్యక్తికి పలు సంధర్భాలలో ఇంగ్లిష్ మాట్లాడటం చాలా అవసరం. విదేశంలో గాని తమ దేశంలో గాని పర్యటిస్థూ సంభాషించటానికి, ఉన్నత విధ్యా చదువులకు, ప్రపంచ వ్యవహారాలను తెలుసుకోటానికి, వివిధ సంస్కృతులు తెలుకోడానికి, మరియు ఇతర ప్రయోజనాలకు ఇంగ్లీష్ చాలా అవసరం.

మీ అవసరాలను తెలుసుకోవడం వలన మీ వృత్తులకు సరిపడే ఇంగ్లిష్ నేర్చుకొంటె చాలు. ఇంగ్లిష్ నేర్చుకోడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని పొరపాటు పడకండి. మీ అవసరాలకు సరిపడే ఇంగ్లీష్ వస్తే చాలు. ఇంగ్లిష్ లో బాగా నేర్పు ఉన్నవారు జీవితమంతా ఇంకా భాష ఫై పట్టు తెచ్చుకోవాలనుకుంటారు.

Related Articles