ఇంగ్లీష్ ప్రపంచ నలుమూలల నుండి జ్ఞానాన్ని పెంచుకునే అవకాశం ఇస్తుంది

by correspondent
Published: Updated: 463 views

పుస్తకాలు లేక సాహిత్యం మనకు వివిధ సంస్కృతులకు పరిచయం చేస్తాయి. అవి మనకు వివిధ సంస్కృతులలో ఉన్న ఆలోచనా పద్ధతులను తెలియజేస్తాయి. అవి చరిత్రలో ఒక ముఖ్యమైన భాగం. మహామేధవులు, తత్వవేత్తలు, పాలకులు మొదలైన వారిని మనము కలవటం చాల కష్టము కానీ, వారు వ్రాసిన పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకాలల్లో ఉన్న అపార జ్ఞానాన్ని మీ సొంతం చేసుకోవాలంటే మీ ఇంగ్లీష్ చాల బాగుండాలి.

మనము మంచి సాహిత్య పుస్తకాలు చదివి పాత యుగం నుండి నేటి ఆధునిక యుగానికి వచ్చాము. చరిత్రలో మఖ్యమైన మార్పులు తేవటంలో సాహిత్యం ప్రముఖ పాత్ర పోషించింది. ఉదాహరణకు, చీకటి యుగంలో వెస్ట్రన్ యూరప్ లోని ప్రజలు అజ్ఞానంతో ప్రాకులాడుతూ ఉండేవారు. ద్వేషం, మనవ హక్కులను అతిక్రమించటం మొదలగు చెడు భావనలు ప్రజల్లో ఉండేవి. బుద్ధి, విజ్ఞానం, కల అనేవి ఉండేవి కావు. పలు పాశ్చాత్య దేశాలలో పునరుద్ధరణ (రినైస్సంస్) కాలం ముందు అనేక బాధలను అనుభవించాయి.

మానవ జాతి పైన పేర్కొన్న అనేక సవాళ్ళు ఎదురుకున్నా, మార్పులు నిరంతరం జరుగుతూనే వచ్చాయి. నేడు, మానవ జాతి ఉన్నత ప్రజాస్వామ్య స్థాయికి వచ్చిందంటే అది సాహిత్యం వల్లే సాద్యం అయ్యింది. సోక్రటీస్, కన్ఫ్యూషియస్ మొదలగు తత్వవేత్తల పుస్తకాలు ప్రజల మనస్తత్వాన్ని చక్కగా తీర్చి దిద్దాయి.

మంచి పుస్తకాలు (పంచతంత్ర, భగవత్ గీత, బైబిల్) యుగాల తరబడి అందరికి మేలు చేస్తాయి. ఇవి మనుష్యులను ఉన్నతంగా ఆలోచించడానికి తోర్పడతాయి. అయితే, ఇంగ్లీష్ నేర్చుకోవడం వలన మీరు ఈ మంచి సాహిత్యాన్ని సులువుగా పొందవచ్చు.

చాలామంది గొప్ప వారు తమ పుస్తకాలను ఇంగ్లీష్ లో రాశారు, అనగా ఇంగ్లీష్ నేర్చుకోవటం ద్వారా మీరు వారి ఆలోచనలను మరియు జ్ఞానాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇంగ్లీష్ నేర్చుకోవటం వలన ఇంకో లాభమేమిటంటే – రష్యన్, ఇటాలియన్, ఫ్రెంచ్, పోర్చుగీసు లేదా ఏదైనా భాషలలోని పుస్తకాలు ఇంగ్లీష్ ో అనువదించ బడతాయి. కాబట్టి, ఇంగ్లీష్ నేర్చుకోవటం వళ్ళ మీరు ప్రపంచ నలుమూలలనుండి జ్ఞానాన్ని సంపాదించుకునే అవకాసం ఉంది.

మీకు ఇంగ్లీష్ రాక పోతే, మీరు నేటి రోజుల్లో గేలవటం చాలా కష్టం.

Related Articles