హైదరాబాద్ నగరంలో అనేకమంది ప్రజలు ఇంగ్లీష్ నేర్చుకోవటం చాలా కష్టమని భావిస్తున్నారు. అందువలన వారు ఇంగ్లీష్ నేర్చుకొనేందుకు భయపడుతున్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం కన్నా బరువులు ఎత్తడమే సులభం అని వారు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి వైఖరి స్పోకెన్ ఇంగ్లీష్ సంస్థలలో చేరిన ప్రజలకు చాలా సాధారణమైన విషయం. దీనికి కారణం, ఇంగ్లీష్ శిక్షణా సంస్థలు క్లిష్టమైన వ్యాకరణాల మీద మరియు పదజాలం మీద దృష్టి పెట్టడం. దీనివలన అందులో చేరిన విద్యార్ధులు సులువుగా ఇంగ్లీష్ నేర్చుకోలేకపోతారు.
ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా?
ఇంగ్లీష్ సులువుగా నేర్చుకోవాలంటే సరైన దిశను తెలుసుకోవడం ముఖ్యం. గంటలకొద్దీ పుస్తకాలను, వార్తాపత్రికలను, నిఘంటువును చూస్తూ తిరిగేయడంవలన ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇలా చేస్తే ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇంకా కష్టంగా మరియు భారంగా అనిపిస్తుంది. ఇంగ్లీష్ నేర్చుకునే విధానం ఎపుడూ కూడా సులువుగా వుండాలి. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నప్పుడు భారంగా అనిపిస్తే మాత్రం ఇంగ్లీష్ ఫై ఆసక్తి తగ్గిపోతుంది.
ఇంగ్లీష్ సరిగ్గా నేర్చుకోవాలంటే అందులోని పదజాల విషయాలను/భావాలను మెల్లిమెల్లిగా నేర్చుకోవాలి. వీటిని నేర్చుకుంటున్నప్పుడు మీకు సౌకర్యం కలగాలి. ఒక్కమాటలో చెప్పాలంటే బొమ్మల పుస్తకాలను చదివినప్పుడు ఎలా ఆనందం కలుగుతుందో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నప్పుడు కూడా అలా అనిపించాలి.
ఇంగ్లీష్ నేర్చుకోవటం బొమ్మల పుస్తకాలతో మొదలుపెట్టండి
ఇంగ్లీష్ మెరుగుపరుచుకోడానికి ఇంగ్లీష్ బొమ్మల పుస్తకాలను చదవండి. ఇలా చదవడం వలన మీకు ఆనందం కలుగుతుంది మరియు ఇంగ్లీష్ లో నైపుణ్యం తెచ్చుకోగలుగుతారు. ఈ పుస్తకాలలోని ప్రతియొక్క వాక్యం బొమ్మలను చూపిస్తూ వివరణగా ఉంటుంది కాబట్టి సులువుగా అర్ధమవుతుంది. ఈ పుస్తకాలను చదివేటప్పుడు మీకు నిఘంటువు కూడా అవసరం పడదు. ఈ పుస్తకాలలోని 60% కథ బొమ్మల ద్వారా తెలిసిపోతుంది.
వార్తా పత్రికలలో మరియు ఆదివారపు సంచికలలో బొమ్మల కథలు వుంటాయి. వ్యాపార సంచికలలో కూడా దొరుకుతాయి. చాలావరకు బొమ్మల పుస్తకాలలో ఎక్కువ కథలు వుంటాయి. అన్ని కథలు హాస్యంగా వుండవు కానీ కొన్ని కథలు సాహసోపేతంగా, చరిత్రగల, సంస్కృతి మరియు సాంప్రదాయాలు తెలిపే పుస్తకాలు వుంటాయి. వీటి ద్వారా ఇంగ్లీష్ తో పాటు అనేక విషయాలను తెలుసుకోవచ్చు.
బొమ్మల పుస్తకాలు ఎప్పటివరకు చదవాలి
బొమ్మల పుస్తకాలలో పట్టు వచ్చేంతవరకూ చదువుతూనేవుండండి. తరువాత హాస్య పుస్తకాలను చదవండి. ఒకవేళ మీరు జోకులను చదువుతున్నప్పుడు అందులోని హాస్యం మీకు అర్ధంకాకపోతే, మీకు ఇంకా ఇంగ్లీష్ ఫై పట్టురాలేదని తెలుసుకోవాలి. పట్టు తెచ్చుకోడానికి మీరు మరిన్ని పుస్తకాలను చదవాలి. అప్పుడే అందులోని హాస్యాన్ని తెలుసుకోగలరు.
ఎపుడైతే మీరు బొమ్మల పుస్తకాలలో పట్టు సాధించుతారో, అపుడే మీరు జోకులను సరిగ్గా అర్ధం చేసుకోగలుగుతారు. పిల్లలకు సంభందించిన చిన్న చిన్న కథలను చదవండి. పిల్లలకు సంభందించిన పుస్తకాలలో చాలా రకాల కథలు వుంటాయి.
రీడర్స్ డైజెస్ట్ పుస్తకం స్పూర్తిదాయకంగా మరియు సమాచారం తెలుపే విధంగా ఉంటుంది. సంచికలు లేదా మీ ఇష్టమైన వార్తా పత్రికల ద్వారా కూడా మీరు ఇంగ్లీష్ ఆసక్తిగా నేర్చుకోవచ్చు. మరోవిషయం, వార్తాపత్రికలలో మీకు ఇష్టమైన భాగాలనే చదవండి. ఇంగ్లీష్ నేర్చుకోవాలని పూర్తి వార్తాపత్రిక చదవడం వ్యర్ధం.
వినోదముతో కూడిన ఆటల ద్వారా కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. పజిల్స్, క్రాస్వర్డ్స్, మరికొన్ని కలగలిసిన పదాల ఆటల ద్వారా కూడా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఈ ఆటలు రోజువారి వార్తాపత్రికలో మీరు పొందవచ్చు. ఈ ఆటలు రెండు విధాలుగా సహాయపడుతాయి: ఒకటి మీరు ఇంగ్లీష్ నేర్చుకోడానికి మరియు అందులో మీ పురోగతిని తెలుసుకోడానికి.
ఏదైనా భాష నేర్చుకుంటున్నప్పుడు తప్పకుండా వినోదం అనే అంశం వుండాలి. అప్పుడే మీరు ఇంగ్లీష్ సులువుగా నేర్సుకొనగలరు.