ఇంగ్లీష్ నేర్చుకోడానికి సరైన పరికరాలు అందించలేని హైదరాబాద్ లోని వాణిజ్య స్పోకెన్ ఇంగ్లీష్ సంస్థలు

by correspondent
Published: Updated: 234 views

చాలా మంది ప్రజలకు సులభమైన ఇంగ్లీష్ అభ్యసించడానికి సరైన విధానం మరియు సరైన పరికరాలు వాడటం తెలియదు. ఏ క్షణంలో అయితే మనం ఇంగ్లీష్ నేర్చుకోవలనుకుంటామో, నిఘoటువు లాంటి పెద్ద పుస్తకాలు మన మనసులోకి వస్తాయి. మనసులో వచ్చే మరొక విషయం ఏమనగా అతి తక్కువ సమయంలో మంచి ఫలితాలను ఇస్తామని 100% హామీ ఇచ్చే స్పోకెన్ ఇంగ్లీష్ సంస్థలు.

ఈ మధ్యకాలంలో అనేక స్పోకెన్ English, TOEFL, GRE, IELTS సంస్థలు హైదరాబాద్ లో కుప్పలుగా వెలిసాయి. ఇంగ్లీష్ బోధనా పేరుతో ఈ సంస్థలు భారీ అంశాలను కూడిన పుస్తకాలను ఇచ్చి విద్యార్ధుల నుండి భారీ మొత్తంలో డబ్బులు అందుకుంటారు.. ఈ పుస్తకాలను చూసి విద్యార్థులు వారి చేతుల్లో ఇంగ్లీష్ నేర్చుకోడానికి విలువైన వనరులు కలిగి వున్నాయని అనుకుంటారు. మరియు ఈ వస్తువుల (పుస్తకాల) విలువ కోచింగ్ ఖర్చుతో సమానమైనదని అనుకుంటారు.

ఇవి నిజంగా ఉపయోగపడుతాయని భావిస్తున్నారా? ఈ వస్తువులను ప్రయత్నించిన వారిని అడగండి. బహుశా చాలా వరకు సమాధానం లేదు అనే వస్తుంది. సమర్థవంతంగా ఫలితాలు ఎప్పుడు అందిస్తాయో లేదో తెలియనప్పటికీ ప్రజలు ఇంకా ఈ సంస్థలు ఇచ్చే పుస్తకాలను ప్రయత్నిస్తూనే వున్నారు.

ఇంగ్లీష్ సామర్ధ్యము పెంచుకోడానికి సులభమైన మరియు శీఘ్రమైన మార్గం చూసుకునే ముందు మీరు మొదట అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏమనగా ఇంగ్లీష్ అనేది ఒక సామర్ధ్యము, కానీ ఒక సబ్జెక్టు కాదు. అందువలన ప్రతి ఇంగ్లీష్ పుస్తకాల నుండి సమాచారం సేకరించటం వలన ఎటువంటి ప్రయోజనం పొందలేరు. ఇలా భాషను నేర్చుకోవడం సరైన మార్గం కాదు. మీరు నిజంగా పరిశీలిస్తే, నగరంలోని అనేకమైన మంచి విశ్వవిద్యాలయాలు – EFLU, OU, HCU, మరియు రామకృష్ణ మత లాంటి విద్యాలయాలు ఏ విధమైన పెద్ద పుస్తకాలు విద్యార్థులకు అందించవు – కాని అర్హత నిపునులవారి నుండి అవసరమయ్యే వనరులు మరియు జ్ఞానం అందించే కొన్ని పుస్తకాలు లాంటివి అందించబడతాయి.

ఇంగ్లీష్ నేర్చుకోవడం సులభమే కానీ, దీని నేర్చుకోడానికి సరైన ప్రక్రియ అవసరం. త్వరగా మరియు సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోడానికి మీకు మొదట కావలసినవి కనీస వస్తువులు లేక కనీస పరికరాలు అవసరం.

వొకాబులరీ (వొకాబులరీ (పదజాల)) పుస్తకం: పదాలు లేకుండా ఒక భాష ఏమిటి? మీరు ఎపుడైతే పదాలు తెలుసుకోలేరో భాష సరిగ్గా ఉపయోగించలేరు. వొకాబులరీ పుస్తకంలో సాధారణంగా ఉపయోగించే పదాల జాబితా మరియు వాటి అర్ధాలు వుంటాయి. అలాగే వాటి నివాసస్థానం ఏంటి, ఎలా ఉపయోగించాలో ఉదాహరణలతో ఇస్తుంది. నిఘంటువు లో పదాలు మరియు వాటి అర్ధాలు వుంటాయి. అయితే ఈ పదాలు కొన్ని సార్లు ఎలా ఉపయోగించాలో భాషలో తెలుపబడతాయు. ఇంగ్లీష్ లోని పదాలు మరియు వాటి అర్ధాలు తెలుసుకోవడం మంచిది. మీరు సులభంగా పదాలను అర్ధంచేసుకోవచ్చు నిఘంటువు ద్వారా. మీరు ఏదో ఒక పుస్తకము చదువుతున్నారు కానీ కొన్ని పదాల అర్ధాలు కచ్చితంగా తెలుసుకోలేకపోతున్నారు. ఈ సంధర్బంలో మీరు నిఘంటువును ఉపయోగించ్చవచ్చు. సరైన పదాలను మాట్లాడటానికి మరియు వ్రాయటానికి మరియు అర్ధాలు తెలుసుకోడానికి మీరు పదజాల పుస్తకాని ఉపయోగించ్చవచ్చు.

బొమ్మల కామిక్స్ (comics) మరియు కథలు: మీకు పైన తెలుపబడిన విషయాలు తీవ్రమైనదిగా అనిపిస్తే, భాషను వినోదపూరితంగా అభ్యసించండి. తెలివిగా మరియు సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సరదాగా వుండే మార్గమును గుర్తించాలి. ఈ ప్రయత్నం చేయటం వలన మీరు ఇంగ్లీష్ సామర్ధ్యమును మరింత పెంపొందించుకోవచ్చు. త్వరగా ఇంగ్లీష్ నేర్చుకోడానికి మరియు మెరుగుపరచడానికి ఉత్తమమైన మార్గం బొమ్మల పుస్తకాల కథలు.

గమనిక: ముఖ్యమైన అంశాలను రాయడానికి ఒక పుస్తకాన్ని పెట్టండి. ఈ పుస్తకం చదవడం వలన మీరు ఇంగ్లీష్ లో ప్రగతి సాధించవచ్చు. ఈ పుస్తకం లేకపోతే ఇంగ్లీష్ నేర్చుకోడానికి చాలా సమయం పడుతుంది. ఈ అంశాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి, ఇంగ్లీష్ మెరుగుపరచుకోడానికి.

పైన పేర్కొన్న పరికరాల సంఖ్య తక్కువగా కనిపించవచ్చు కాని మీరు సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. పరికరాలు సరిగ్గా ఉపయోగించడం వలన మీరు త్వరగా ఇంగ్లీష్ లో పట్టు సాధిస్తారు.

Related Articles