ఇంగ్లీష్ నేర్చుకోడాని కి నేర్చుకోవాలనే కోరికతో పాటు తపన అవసరం

by correspondent
Published: Updated: 231 views

అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడాలని చాల మందికి కోరిక. కాని ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమవటంతో నిరాస చెందుతారు. ఎందుకిలా జరుగుతుందో మీలో ఎవరికన్నా తెలుసా ? కేవలం మాట్లాడాలనే కోరిక తప్ప నేర్చుకోవాలనే తపన లేక పోవటమే ఇందుకు కారణం.

ఇంగ్లీష్ నేర్చుకోనటం సులభమేనా?
ఇంగ్లీష్ అయిన వేరే ఏ భాష అయిన సరే, నేర్చుకోవాలనే సుముకత, అంకిత భావంతో పాటు బాష పట్ల ఆసక్తి, మకువ ఉండటం చాల అవసరం. ఇవి బాష సులబంగా నేర్చుకోవటాని సహాయపడతంతోపాటు మిమల్ని మానసికంగా సిధపరుస్తాయి. మానసికంగా సిధంగా లేనివారికి, బాషపట్ల మకువ లేనివారికి ఇంగ్లీష్ నేర్చుకోవటం ఒక శిక్షలాగా అనిపిస్తుంది. ఈ విదమైన నిరాసక్తి, నిర్లిప్తతలే ఇంగ్లీష్ మాట్లాడటం రాకపోవటానికి ప్రధమ కారణాలు. ఎ బాష నేర్చుకోవటానికి అయిన ఆ బాష మీద మకువ ఉండటం అవసరం. బాష నేర్చుకునీ విధానాన్ని సానుకూలంగా మలుచుకోవటానికి మనల్ని మనం మానసికంగా సిదపరచు కోవటం చాల అవసరం.

బాషను ప్రశంసించండి !
ఒక బాషని నేర్చుకోవటానికి ఆ బాష పట్ల మంచి అబిప్రాయం కలిగి ఉండటం చాల అవసరం. అలానే, ఇంగ్లీష్ నేర్చుకోవటం మీ లక్ష్యం అయినపుడు ఆ బాష పట్ల మంచి భావన, ఆ బాషను నేర్చుకోవాలనే తపన కలిగి ఉండండి. ఇంగ్లీష్ మీద మీరు పెంచుకునే మక్కువ, మీలోని ఉత్సాహాన్ని పెంచటంతో పాటు మీలోని ఆత్మవిశ్వాసాని మెరుగు పరుస్తుంది. గుర్తుంచుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోవటం ఒక నెల లేదా 45 రోజులో పూర్తీ అయ్యే ప్రక్రియ కాదు.

ఇంగ్లీష్ ప్రధానంగా మాట్లాడే అమెరికాలాంటి దేశాలలో తెలివితక్కువ వారు, చదువురాని వారు, చిన్న, చిన్న ఉద్యోగాలు చేసే వారు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు. వారితో పోల్చుకుంటే మనం ఎందులోనూ తీసిపోము. మరి అలాంటపుడు మనం ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడలేము? ఆ బాషను మనస్పూర్తిగా ప్రశంసించి, ఇంగ్లీష్ లో మాట్లాడే ప్రక్రియను మన జీవితంలో ఒక భాగం చేసుకోగాలిగితే ఇంగ్లీష్ ను అతి సులభంగా, సమర్థవంతంగా నేర్చుకోవచ్చు.

ఇంగ్లీష్ ను విదేశి బాషగా భావించకండి !
చాలా మంది ఇంగ్లీష్ నేర్చుకోలేకపోవటానికి ముఖ్య కారణం వారికీ ఇంగ్లీష్ పట్ల ఉన్న అబిప్రాయం. వారు ఇంగ్లీష్ కేవలం వృతి పరమైన ప్రయోజనాల కోసమే నేర్చుకోవలనుకుంటారు. ఇంగ్లీష్ మాట్లాడటం మన సంస్కృతీ లో భాగం కాదు కాబటి వారు ఇంగ్లీష్ ని విదేశి బాషగానే బావిస్తారు. వృత్తిపరంగా ఇంగ్లీష్ ప్రపంచ భాష కావటం వలన వారు ఈ భాష ద్వారా ప్రయోజనం ఆసించినపటికి వారి వ్యక్తిగత జీవితాల్లో నుండి ఇంగ్లీష్ ను దూరంగా ఉంచుతారు.

చాలా మందికి ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరిక ఉన్నపటికీ వారికీ ఆ బాష మీద సరైన అబిప్రాయం లేనందున, దానిని ప్రససించలేక పోతునారు. దీని వలన వారు బాష నేర్చుకోలేక పోతునారు. బాష లోని అందని చూడలేని వారు ఆ బాషను ఎన్నటికి నేర్చుకోలేరు.

Related Articles